పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు/అమీన్పూర్/సంగారెడ్డి
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తుల సంఖ్యకు అనుగునంగా పూర్తి ఏర్పాట్లు చేసామని తెలిపారు. అనంతరం మంజీర నగర్ కాలనీలో గల శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పటాన్చెరు పట్టణంలోని మహదేవుని ఆలయం, మాణిక్ ప్రభు శివాలయం, జెపి కాలనీ ఉమామహేశ్వర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామ శివారులో శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర సిద్ధాంతి గార్ల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కోటి రుద్రాక్ష లింగార్చన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్రాక్ష మాలను అందించారు. త్వరలోనే పీఠాన్ని దర్శించి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యాపీఠం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, బీరంగూడ ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, మాజీ చైర్మన్ తులసి రెడ్డి, ఆలయ ఈవో శశిధర్, నర్రా బిక్షపతి, కొమరగూడెం వెంకటేష్, వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…