_సమిష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి
_ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి
_పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
సాంకేతిక వ్యవస్థ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అంశమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీకృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్ సెట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. బీరంగూడ మంజీరా నగర్ కాలనీలో వడ్డెర సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దాతలు కాలనీ సంక్షేమ సంఘాల సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మనం ఏ ప్రాంతం,…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కృత్రిమ మేధస్సు…
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…