Telangana

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్.

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి..

_సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

_ఏప్రిల్ 1 నుండి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు ప్రారంభం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హామీలు ఇవ్వడం ఆపై మర్చిపోవడం అలవాటుగా మారిన ప్రస్తుత రాజకీయాల్లో.. హామీ ఇస్తే అమలు చేసే వరకు పట్టువదలని విక్రమార్కుడు వలె నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరొందిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి పర్వదినాన శుభవార్తను అందించారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో నెంబర్ 30ని జారీ చేశారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం మండలాలను చేరుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం అన్నారు.సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకి రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేదని అన్నారు. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని తెలిపారు.ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.నూతన భవనం అందుబాటులో వచ్చేవరకు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే పటాన్చెరు సబ్ రిజిస్టార్ కార్యాలయం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పటాన్చెరువు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నూతన కార్యాలయం భవనాన్ని నెల రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ గారి సభలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రెండు హామీలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జి ఎం ఆర్ తెలిపారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తో పాటు 70 కోట్ల రూపాయలతో బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 100 ఫీట్ల రహదారుని విస్తరించడం జరిగిందని తెలిపారు.పటాన్చెరు, జిన్నారంలలో మున్సిఫ్ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారుహెచ్ఎండిఏ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరుగుతుందని తెలిపారు.ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆడిట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ సేవలు సైతం పటాన్చెరులోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, రాజు, షేక్ హుస్సేన్, గోపాల్, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, పృథ్విరాజ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…

2 days ago

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

3 days ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

4 days ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

4 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

4 days ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

4 days ago