Telangana

గీతమ్ లో జాతీయ సాంకేతిక పోటీలు…

– విజేతలకు లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 5-6 తేదీలలో ‘టెక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత్ ఆర్.ముదిమెల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఐవోటీ హ్యాకథాన్’, ‘రిమోట్ కంట్రోల్ కార్ రేస్’లను నిర్వహిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.హ్యాకథాన్ప జిజ్ఞాస ఉన్న ప్రతిభావంతులను ఒకచోట చేర్చి, వారి ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, కొత్తవారితో పరిచయాలు ఏర్పరచుకోవడం, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికి వీలుగా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 30 గంటల నిడివితో సాగే ఈ ఉత్కంఠభరిత కార్యక్రమంలో సమస్య గుర్తింపు, దానిని పరిష్కరించే కోడ్ రాయడం, ఆచరణీయమైన, సరళీకృత పరిష్కారాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు, ఒక్కో బృందంలో ఒకటి నుంచి నలుగురు సభ్యులుండాలని, వారికి ఐదు సమస్యలనిస్తామని, అందులో ఒకదానిని పరిష్కరించాలని పేర్కొన్నారు. విజేతలకు రూ.50 వేలు, ద్వితీయ విజేతకు రూ.25 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను ఇస్తామని డాక్టర్ ప్రశాంత్ తెలియజేశారు.’రిమోట్ కంట్రోల్ (ఆర్.సీ) కార్ రేసింగ్’ అనేది ఒక ఆహ్లాద, ఉత్తేకరమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొనేవారు ఇతర ఆటగాళ్లతో పోటీపడేందుకు రిమోట్ నియంత్రిత కార్లతో, అవరోధాలతో కూడిన ట్రాక్లో కార్లను నడపాల్సి ఉంటుందన్నారు. వెర్డ్స్ కార్లను బ్యాటరీతో నడపాలని, తక్కువ సమయంలో పోటీని పూర్తిచేసిన వారిని విజేతలు ప్రకటించి, రూ.15 వేలు, రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు.ఆయా పోటీల నిబంధనలు, పేర్ల నమోదు, వసతి తదితర వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్తలు మోహన్ సిద్దేశ్వర్ (9000 2726 32), సాకేత్ (630 160 2726)లను సంప్రదించాలని, లేదా toieeehyd@gitam.in కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago