రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం అంశంలో అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత
కార్యకర్త కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం భూమి అంశంలో నష్టపోతున్న అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు.గ్రామంలో ఆధునిక వసతులతో పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని భావించి సంబంధిత భూమి లబ్ధిదారులతో ఇటీవల చర్చించి పాఠశాల నిర్మాణానికి భూమి అందించేలా వారిని ఒప్పించారు. ఈ మేరకు గురువారం గ్రామ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం ఆవరణలో గ్రామపుర ప్రముఖుల సమక్షంలో భూమి లబ్ధిదారులు జొన్నాడ మహేష్, జహంగీర్లకు 5 లక్షల రూపాయల చొప్పున10 లక్షల రూపాయల సొంత నిధులు అందజేశారు. పాఠశాల నిర్మాణానికి భూమి అందించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.
కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్
దశాబ్ద కాలంగా తన విజయాల్లో వెన్నింటిగా నిలుస్తూ ఇటీవల మృతి చెందిన రుద్రారం గ్రామానికి చెందిన కురుమ నరసింహులు కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తోడుగా నిలిచారు. గురువారం రుద్రారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి.. లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని అభయహస్తం అందించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీలు మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…