_క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం
_విజేతలకు 75,000 ప్రైజ్ మనీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుఢ్యత లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహించిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలుగా నిలిచిన బీరంగూడ జట్టుకి 50వేల రూపాయలు, ఎంఆర్ఎఫ్ గా నిలిచిన పటాన్చెరువు చెట్టుకి 25 వేల రూపాయల సొంత నిధులను నగదు బహుమతులుగా అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు అంతిరెడ్డి, బండి శంకర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…