పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మూడు డివిజన్ల పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుందని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు అనుగుణంగా సత్వరమే నిధులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…