_జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంబరాన్నంటిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
_హాజరైన 200 ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు
_200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనసత్కారం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురువు లేకుండా ఏ విద్యార్థి రాణించలేడని అన్నారు. సమాజంలో గురువులకు ఉన్న గౌరవ స్థానం ఎవ్వరికి లేదన్నారు. నాడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారు తల్లిదండ్రులుకంటే గురువులనే మొదటగా గుర్తించుకుంటున్నారని తెలిపారు. ప్రతి గురువు విద్యార్థులు సన్మార్గంలో నడిపితే వారే సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు. విద్యార్థులను బాగా చదువుకునేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులేదనన్నారు. తాను ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు ప్రతి ఏటా గురుపూజ వేడుకలను పండగల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ అర్హులైన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.దశాబ్ది కాలంలో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం నియోజకవర్గ పరిధిలోని 200 ప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సత్కరించారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాల ఉపాధ్యాయునిలు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ కు పటాన్చెరు నియోజకవర్గ ప్రైవేటు పాఠశాల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకుడు దశరథ్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మండల విద్యాధికారి పి పి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ప్రైవేటు పాఠశాలల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి తేజ, నియోజకవర్గ అధ్యక్షులు విలియం జేమ్స్, జగన్మోహన్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…