పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన నల్లా సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కుని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. అనంతరం గుమ్మడిదల మండలం అన్నారం, జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన రెండు బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందగా, 40 వేల రూపాయల చొప్పున 80 వేల రూపాయలు నష్ట పరిహారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ మాజీ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, షేక్ హుస్సేన్, విద్యుత్ శాఖ ఏడిలు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, ఏఈలు రాజు, అనంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…