మనవార్తలు ,పటాన్ చెరు :
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరత్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, తులసి రెడ్డి, షేక్ హుస్సేన్, గోవింద్, లియాకత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని సోమవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత నాయకుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన జీవితం తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ్ రెడ్డి వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…