_వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ
_ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్ కు పేరు తీసుకుని రండి
మనవార్తలు ,పటాన్ చెరు:
వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సంగారెడ్డి జిల్లా పోలీసుల అధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పోలీస్ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో నీ నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ 50 లక్షల రూపాయల స్వంత నిధులు వెచ్చించి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, బోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయం అన్నారు.
90 రోజుల పాటు తల వంచి ఇష్టపడి చదివితే, జీవితాంతం తల ఎత్తుకొని బతక వచ్చని అన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి ఎమ్మెల్యే జిఎంఆర్ కి, నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని కోరారు. 2017 సంవత్సరంలోను ఎమ్మెల్యే జిఎంఆర్ 500 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తే, సుమారు 350 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం జిల్లా పోలీసుల సహకారంతో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…