_మెట్రో రైల్ సాధించేవరకు పోరాడతాం
మనవార్తలు,పటాన్‌చెరు:
గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలును పొడగించాలని ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మియాపూర్ ,లింగంపల్లి ,పటాన్ చెరు ,సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువచ్చేందుకు సంగారెడ్డి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు హైదరాభాద్ మెట్రో రైలు సాధన ఉద్యమం కొనసాగుతుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ వెల్లడించారు.
పటాన్ చెరు పట్టణంలో ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ మియపూర్ నుండి పటాన్ చెరు సంగారెడ్డి వరకు మెట్రో రైల్ సాధన కోసం మరో ఉద్యమానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ తెరలేపారు. మెట్రో రైల్ సాధన ఉద్యమంలో భాగంగా ఆదివారం పెద్దయెత్తున ఆయన అనుచరులు, కార్యకర్తలు,ఉద్యమకారులతో జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చి పటాన్ చెరు చౌరస్తా వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మెట్రో రైల్ సాధన కోసం ఉద్యమం చేస్తామని ప్రకటించారు.ఇది ప్రజలకోసమే కాని తన రాజకీయ కోసం కాదని ఈ ఉద్యమం కోసం అన్ని పార్టీల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు.మెట్రో రైల్ సాధించేవరకు ఈ ఉద్యమం అగదని ఇది కేవలం, ఈ ప్రాంతప్రజల ఎజండాగా ముందుకుసాగుతుందని త్వరలోనే విది విధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం పటాన్ చెరులో హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…