మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్ చేరు పట్టణంలో నూతనంగా నిర్మించే లయన్స్ క్లబ్ భవనానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ పది లక్షల చెక్కును అందజేశారు. జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్మించే ఈ భవనానికి ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ గారు పది లక్షల చెక్కు జై పాల్ ముదిరాజ్ గారి సమక్షంలో మహిపాల్ రెడ్డి అందజేశారు. దేవేందర్ రాజు అనేక సందర్భాలలో ప్రజలకు అండగా నిలుస్తూ పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు గా మారిన నేటి తరుణంలో పేదలకు అన్నీ తానై నిలబడుతూ అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు.
అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు విద్యార్థులు, పేద ప్రజలు, క్రీడాకారులు ఇలా అన్ని రంగాల ప్రజలకు ఎల్లవేళలా తాను ఉన్నానంటూ ఉన్నతమైన సేవలందిస్తున్నారు. అలాంటి దేవేందర్ రాజు లయన్స్ క్లబ్ భవనానికి 10 లక్షలు అందించి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉచితంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తూ పేదలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న టువంటి లయన్స్ క్లబ్ భవనం పటాన్ చెరులో నిర్మించడం సంతోషదాయకం అన్నారు.
వీటితోపాటు లయన్స్ క్లబ్ వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆదుకుంటుందని అన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని మరోమారు నిరూపించిన దేవేందర్ రాజు గారిని ప్రజలందరూ ఆదర్శప్రాయుడుగా పేర్కొంటున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మరియు లయన్స్ క్లబ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…