Telangana

మల్లన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాతరలు ప్రతీక అన్నారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి,ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, శ్రీధర్ చారి, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago