Telangana

మహిళల సాంస్కృతిక ప్రతిభకు బీఆర్‌ఎస్ పెద్దపీట

భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు

పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేయగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల సాంస్కృతిక సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

రంగోలి పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభతో ఆకట్టుకున్నారు. రంగుల సమన్వయం, సంప్రదాయ నమూనాలు, సందేశాత్మక చిత్రాలతో పార్కులు కళాకాంతులతో మెరిసాయి. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ అధ్యక్షురాలు శ్రీమతి రాణి యాదవ్,రామస్వామి, మాజీ కౌన్సిలర్ నాగమణి, మహిళా బీఆర్‌ఎస్ నాయకులు స్వర్నలత, లక్ష్మి, అనిత, ఫాతిమా, రాధ, సునీత, బేబీ, అరుణ జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, నస్రీన్, గాయత్రి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago