Telangana

మూసీ తరహాలో మంజీరా నదిని కూడా రక్షించాలి మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాద్‌లోని మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. అదే స్థాయిలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల జీవనాధారమైన మంజీరా నదిని కూడా కాలుష్యం బారినుండి రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు  డిమాండ్ చేశారు.గోదావరి ఉపనది అయిన మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకు సాగు మరియు తాగునీటి ప్రధాన ఆధారంగా ఉందని తెలిపారు భావితరాలకు సాగు మరియు తాగునీటికి ఉపయోగపడే మంజీరా నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలోని నాలాల ద్వారా వచ్చే మురుగు నీరు మరియు పారిశ్రామిక సంస్థలు విడుదల చేసే రసాయన వ్యర్థాలు నక్కవాగు ద్వారా ఇస్మాయిల్ ఖాన్‌పేట్ పరిసర ప్రాంతాల్లో మంజీరా నదిలో కలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీరు చివరకు కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్‌లోకి చేరుతుందని, ఈ పరిస్థితి కొనసాగితే మంజీరా నది భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండి వేలాది ఎకరాలకు సాగునీరు మరియు లక్షలాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న మంజీరా నది కాలుష్య సమస్యపై కూడా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అదేవిధంగా, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం గతంలో పటాన్‌చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం భవనాలు నిర్మించడం సరిపోదని, కాలుష్య బాధితులకు తక్షణమే పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు స్వచ్ఛమైన పర్యావరణం పొందే హక్కు కూడా ఉందని గుర్తు చేశారు. అలాగే నీటి కాలుష్య నివారణ చట్టం–1974ను కఠినంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మూసీ నది తరహాలోనే మంజీరా నది పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడానికి వెనుకాడనని మెట్టు శ్రీధర్ హెచ్చరించారు. మంజీరా నదిని కాలుష్యం బారినుండి రక్షించుకోవడం ప్రభుత్వంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరి బాధ్యత అని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్   పిలుపునిచ్చారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago