Telangana

తృణధాన్యాలను దెనందిన జీవితంలో భాగం చేసుకోండి…

– గీతం విద్యార్థులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మన దైనందిన జీవితంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలని, ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా వాటిని భుజించడం అలవరచుకోవాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వెస్ట్ ఛాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది 2023’ ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన పూర్వీకులు అన్నిరకాల తృణధాన్యాలు తిని, వాటిలో మంచి పోషకాలు లభించడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవారని, కానీ ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్స్ వంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు బాగా పాలిష్ చేసిన వరి అన్నాన్ని తినడానికి అలవాటుపడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారని ఆమె విచారం వెలిబుచ్చారు. ప్రతిఒక్కరూ తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలను, అంటే రాగి ఇడ్లీ, రాగి దోస, కిచిడీ వంటి వాటిని కనీసం ఒక పూట అయినా తినేలా అలవాటు చేసుకోవాలని సూచించారు. వాటిలో కాల్షియం, ప్రోటీన్, ఫెబ్రర్లు ఎక్కువగా ఉండడం వల్ల విరేచనం సాఫీగా అవుతుందని, తద్వారా దాదాపు సగం రోగాలు కూడా నయమవుతాయన్నారు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు చిరుధాన్యాలను భుజిస్తే, అవి నెమ్మదిగా అరగడం వల్ల ఎక్కువసేపు శక్తిని విడుదల చేస్తాయని వీసీ డాక్టర్ నీరజ చెప్పారు.అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాదిపై గీతం అవగాహన కల్పించడం ముదావహమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ అన్నారు. మొక్కల ద్వారా వచ్చిన చిరుధాన్యాలను ప్రతిరోజూ భుజించగలమని, అందులో కూడా ప్రోటీన్ ఉంటుందని, అదే మాంసాహారాన్ని రోజూ తీసుకోలేమన్నారు. పలురకాల ఆహారాన్ని (డెవర్సిఫెడ్జ్ ఫుడ్ ను భుజించడం వల్ల తగినంత పోషకాలు లభిస్తాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. తగినంత ప్రతిఫలం లభించేలా చేస్తే రెతులు కూడా ముందుకొచ్చి తృణధాన్యాలను సాగుచేస్తారని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

కొన్నిరకాల ఆహారాలు భుజించాక పొట్ట, మెదడు చాలా చైతన్యవంతంగా పనిచేస్తాయని, అలా మనకు అనుగుణమైన, అందుబాటులోని ఆహారాలను, మంచి అవగాహనతో భుజించడం అలవరచుకోవాలని ఉస్మానియా వర్సిటీకి చెందిన డాక్టర్ డి.కోదండరామ్ సూచించారు. ఏది, ఎప్పుడు, ఎంత తినాలనేది కూడా ముఖ్యమన్నారు.మంచి, పోషక విలువలున్న ఆహారాపు అలవాట్లను చిరుప్రాయం నుంచే అలవరచుకోవాలని, సహజ సిద్ధంగా దొరికే అడవి పండ్లను, స్థానికంగా దొరికే నూనె గింజలను తినడం మంచిదని వికాస డెరైక్టర్ బి. సాలోమి యేసుదాస్ సూచించారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సి. అరుణారెడ్డి, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ దత్తాత్రి కె.నగేష, ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.చిరుధాన్యాలతో చేసిన పలురకాల వంటకాలను విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ దక్కన్ డెవలప్మెంట్ సొసెట్రీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చిరుధాన్యాలతో చేసిన పలురకాల ఆహార పదార్థాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. పలు అంశాలలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago