మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి అన్నారు.ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ 2004లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో, వారికి ఉపాధి కల్పించి ఆర్థికంగా బలపరచేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు పని దినాలు లభించి వారి జీవన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు.
అయితే ప్రస్తుత బీజేపీ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి “వికసిత్ భారత్ – జీ రామ్ జీ” పేరుతో బిల్లు తీసుకురావడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉపాధి పనులు కార్మికుల చేత చేయిస్తే, ప్రస్తుతం 90 శాతం పనులను యంత్రాల ద్వారా చేసుకునేలా చట్టంలో మార్పులు చేశారని అన్నారు. అలాగే గతంలో ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరిస్తే, ఇప్పుడు 40 శాతం భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర మౌళి, మార్గరి శ్రీనివాస్, వి.కే. రమేష్, కరుణాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేష్ ముదిరాజ్, శ్రీనివాస్, సుబ్బయ్య, మధుసూదన్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్‌ను అందంగా సమతుల్యం చేస్తాయి అని నటి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ…
సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్: సమ్మక్క…
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మూడు కోట్ల 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 30…
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఎంటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న…