ఐక్యంగా ఉందాం.. సమస్యలను పరిష్కరించుకుందాంటీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్

politics Telangana

* జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం అవసరం

* నేడు పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి సమావేశం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

జర్నలిస్టులందరం ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనాథ్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11న రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కె.ఫైజల్ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని శ్రీనాథ్ తెలిపారు. అలాగే పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి కమిటీని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు అబ్దుల్ బాసిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి చెన్న బసవేశ్వర్ తో పాటు జిల్లా కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని శ్రీనాథ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *