politics

ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్ చెరు

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీ లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన చర్చి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని తద్వారా వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిఇంటికి నీరు అందించారని తెలిపారు

వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులం మతం వర్గం తేడాలేకుండా అన్ని ప్రధాన పండుగలను సంబురంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం మధు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి,  కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ ,  స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

22 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

22 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

22 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago