Telangana

ప్రణీత్ గ్రూప్ నుండి మరో ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభం

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : :

రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ పూర్తీ చేసిన ప్రణీత్ గ్రూప్ ఈ ఏడాది ఒకేసారి ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేసినట్లు ప్రణీత్ గ్రూప్ ఛైర్మెన్  నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు .హైదరాబాద్ మియాపూర్ నరేన్ కన్వెన్షన్ సెంటర్ లో కస్టమర్లు , శ్రేయోభిలాషులు ,అభిమానుల మధ్య ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ , ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ , ప్రణీత్ ప్రణవ్ జైత్ర, ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ , ప్రణీత్ ప్రణవ్ ఎక్సపీరియా అనే ఐదు కొత్త ప్రాజెక్ట్స్ కు సంబందించిన బ్రోచర్లు లాంచ్ చేసారు .

ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ : ఈ ప్రాజెక్ట్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో బాచుపల్లి మెయిన్ రోడ్ పక్కన జి ప్లస్ 14 అపార్టుమెంట్ 668 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ : ఈ ప్రాజెక్ట్స్ దుండిగల్ గాగిల్లాపూర్ లో 70 ఎకరాల విస్తీర్ణంలో 884 విల్లాలు .. 167 గజాల నుంచి 350 గజాల వరకు ట్రిప్లెక్స్ విల్లాస్ స్పానిష్ మోడల్ లో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు.

ప్రణీత్ ప్రణవ్ జైత్ర : హైటెక్ సిటీ కి అతి చేరువలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ హైదర్ నగర్ లో 4.79 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్స్ తో 576 ప్రీమియర్ లగ్జరీ ఫ్లాట్స్ ను అందిస్తున్నారు.

ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ : ఈ ప్రాజెక్ట్ మల్లంపేట్ లో ఔటర్ రింగ్ రోడ్ కు చేరువలో ఎగ్జిట్ నెంబర్ 4 వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో 230 కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు.

ప్రణీత్ ప్రణవ్ ఎక్సపీరియా : హైదరాబాద్ ఈస్ట్ లో పోచారం వద్ద అన్నాజీగూడలో ఐదుఎకరాల విస్తీర్ణంలో 210 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి .

ఈ ఐదు కొత్త ప్రాజెక్ట్స్ రెండున్నర సంవత్సరాల్లొ పూర్తిచేయనున్నట్లు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ నరేంద్రకుమార్ కామరాజ్ తెలిపారు.ఒకేసారి ఐదు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్ గ్రూప్ లో పెట్టుబడులు పెడితే భవిష్యత్లో మంచి ఫలితాలు ఉంటాయన్నారు . కస్టమర్లు ఈ ఆవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు కోరారు. త్వరలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నట్లు నరేంద్ర కుమార్ కామరాజు వెల్లడించారు.ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిధిగా ఫైనాన్స్ డైరెక్టర్ కె వి ఎస్ నరసింగ్ రావు, రామాంజనేయ రాజు , నర్సి రెడ్డి,ఆదిత్య కామరాజు , దినేష్ రెడ్డి , సందీప్ రావు మాధవరం పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago