పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్చెరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను తెలియజేయాలన్న లక్ష్యంతో పటాన్చెరు బస్టాండ్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతి త్వరలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, శీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, వేముల రమేష్, రఘు రాముల, సునీల్, జగదీష్, శ్రీ రామ్, అశోక్, కృష్ణ, లక్ష్మణ్, కృష్ణ, సదానంద, ప్రసాద్, రాజు స్టీల్, సతీష్, నామ రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…