_తరలివచ్చిన ఉత్తర భారతీయులు
పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు )
మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం, ఛట్ పూజ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాల సమీపంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భోజ్ పూరి నటుడు కేసరి లాల్ యాదవ్, గాయకురాలు అక్షరా సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అందరిని ఉర్రూతలూగించింది.నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశ మైలారం, రామచంద్రాపురం, బొల్లారం, పటాన్చెరు తదితర పారిశ్రామిక వాడలతోపాటు ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఝార్ఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ అభిమాన నటుడి ప్రత్యక్ష సంగీత విభావరిని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేల సంఖ్యలో తరలివచ్చారు.సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వేలాదిమంది ఉత్తర భారతీయులతో కలిసి వేదిక పంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఉన్న ఊరిని విడిచిపెట్టి.. జీవనోపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గానికి తరలివచ్చిన ప్రతి ఉత్తర భారతీయుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తక్షణమే అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కేసరి లాల్ యాదవ్, అక్షర సింగ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మనోజ్ కుమార్, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, శంకర్ యాదవ్, సపాన దేవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సందీప్ శా, జై కిషన్, రవి, సంజయ్ సింగ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…