_విద్యార్థి దశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి
నంద్యాల ,మనవార్తలు ప్రతినిధి :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ,చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో నంద్యాల విద్యార్థి సత్తా చాటాడు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌషిక్ నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో సింగిల్ ,మక్సిడ్ ,డబుల్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు ముడియం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రంగారావులు తెలిపారు.విజేతగా నిల్చిన కౌశిక్‌ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ మెమోంటోతో సత్కరించి 37 వేల నగదు బహుమతి అందించాడు . శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలను ప్రొత్సహిస్తున్నామని డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థినీ ,విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు .విద్యార్థుల్లోని టాలెంట్‌ను గుర్తించి వారిని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు క్రీడల్లో కళాశాల ప్రతిష్ఠను పెంపొందించిన కౌశిక్‌ను కళాశాల యాజమాన్యం శాలువతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ లెక్చరర్లు ,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…