— అమీన్పూర్ సర్పంచ్‌గా విశేష సేవలు అందించిన శశికళ యాదవ రెడ్డి
— గత సేవలను కొనియాడిన రాములు
మనవార్తలు ప్రతినిధి , అమీన్ పూర్ :
తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ రెడ్డి గారిని పటాన్చెరు నియోజకవర్గం స్వేరో నెట్వర్క్ ఇంచార్జ్ కైతలాపురం రాములు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కైతలాపురం రాములు మాట్లాడుతూ.. శశికళ యాదవ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకురాలని కొనియాడారు. గతంలో అమీన్‌పూర్ సర్పంచ్‌గా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా కూడా సమర్థంగా సేవలందించారని గుర్తుచేశారు.ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెదని తెలిపారు. అలాంటి సేవా భావం కలిగిన నాయకురాలిపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయం అని అన్నారు.ఇకపై కూడా మహిళల సమస్యల పరిష్కారంలో శశికళ యాదవ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనూష, నర్సింగ్ గౌడ్, స్వేరో నెట్వర్క్ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…