Hyderabad

తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలి_భట్టి

 మనవార్తలు  , హైదరాబాద్‌:

రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే సాయం చేయాలన్నారు. 1,200 మంది అమరులకు న్యాయం చేస్తామంటేనే ఆర్థిక సాయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అని సీఎం కేసీఆర్‌ను భట్టి నిలదీశారు.‘కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషమే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపిన కేసీఆర్‌.. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకుంటున్నారు. దిల్లీపై యుద్ధమే అని మరోసారి అమిత్ షాను కలుస్తానంటున్నారు. మరి ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకుంటారా?యుద్ధం అని చెప్పి సీఎం కేసీఆర్‌ దిల్లీలో ఉన్నారు.

ఇక్కడ రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేకుండా పోయారు. వచ్చిన పంటంత రోడ్లపై వానలో తడుస్తుంది. కేసీఆర్ మాట మీద నిలబడాలి. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకోవద్దు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఏడున్నరేళ్ల నుంచి నీటి వాటా తేల్చలేదని సీఎం అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వమని అడిగితే.. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినా డీపీఆర్‌లు ఇవ్వరు. కేంద్రం-ఏపీ-తెలంగాణకు మధ్య జరుగుతున్న అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago