Telangana

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని 350 చర్చిలకు సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతికి, ప్రేమకు క్రిస్మస్ పండుగ ప్రతీక అని అన్నారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి చర్చికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సొంత నిధులతో నూతన చర్చిల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో క్రిస్టియన్లకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అతిక్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago