Telangana

ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ అండర్ 18 డబుల్స్ విభాగంలో సత్తా చాటిన _హైదరాబాదీ క్రీడాకారిణి షన్వితారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ యువ క్రీడాకారిణి షన్వితారెడ్డి ఐటీఎప్ జూనియర్ సర్క్యూట్ అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.ఉగాండ దేశంలోని కంపాలాలో జరిగిన ఐటీఎప్ అండర్ 18 విభాగంలో వివిధ దేశాల క్రీడాకారులతో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి చక్కటి ప్రతిభ కనబర్చారు. వివిధ దేశాల క్రీడాకారుల తో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి విన్నర్ గా నిలిచింది. టెన్నిస్ డబుల్స్ లో భారతదేశం తరపున నూకల షన్విత రెడ్డి జర్మనీకి చెందిన మిచెల్లి కోయిమిచ్, రష్యాకు చెందిన లీలియా అకోమీటోవా , ఇండియా తరపున సీహా మహాజాన్ తో పోటీ పడి 3-6,6-4,10-4 స్కోర్ తో ఫైనల్ లో టెన్నిస్ డబుల్స్ లో విన్నర్ గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ టెన్నిస్ టూర్ జూనియర్ సర్క్యూట్ అండర్ 18 సింగిల్స్ లో రన్నరప్ గా నిలిచింది.

బాలికల సింగిల్స్ ఫైనల్స్ లో శాన్విత 4-6, 3-6 తేడాతో రష్యాకు చెందిన టాప్ సీడ్ లేలా అక్ మోటావా చేతిలో ఓడిపోయింది. చివరి వరకు అద్బుత ప్రతిభ కనబర్చిన శాన్విత ఫైనల్స్ లో గట్టిగా పోరాడినా లేలాపై పైచేయి సాధించలేకపోయింది. పటాన్ చెరుకు చెందిన షన్వితారెడ్డి ప్రస్తుతం గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ లో పదకొండవ తరగతి చదువుతోంది. పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి కుమార్తె షన్వితారెడ్డి టెన్నిస్ క్రీడలో రాణించడంపై స్థానికులు హర్షం వక్తంచేస్తున్నారు . షన్వితకు విజయ్ టెన్నిస్ అకాడమి కోచ్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు అభినందనలు తెలిపారు . ఐటీఎప్ వరల్డ్ టెన్నిస్ టూర్ అండర్ 18 సింగల్స్ లో 1823 ర్యాంకింగ్ దక్కించుకున్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

21 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

21 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago