రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు

ప్రజాకంటక ప్రభుత్వానికి త్వరలోనే చరమగీతం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ఊర్మిళ వెంకట్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డిల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని అతి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలుగా పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో తిరిగి రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన విజయ్ సింగ్, హనుమంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సాయి, నరేష్ ఈశ్వర్, రాజు, లోకనాథ్ సింగ్, కిరణ్, నబీ, తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిలర్లు ఊర్మిళ వెంకట్ రెడ్డి అంతిరెడ్డి, దుర్గారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శివారెడ్డి, సల్మాన్, సీనియర్ నాయకులు రామచందర్, దుర్గేశ్, సాయికిరణ్ చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *