ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదు..
– వాశిలి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి :
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం పై నిందలు మోపడం మాని, తప్పనిసరిగా ఎవరికివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సామాజిక వేత్త, టీఆరెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి మరణాలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా విధించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తున్నందున ప్రతిఒక్కరూ బాధ్యతతో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. ఇళ్లలోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని, మనమంతా తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…