చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ ఇతివృత్తంలో స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వేడుక సాగింది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగాభ్యాసాల ప్రాముఖ్యతను నిపుణుడైన యోగా బోధకుడు పరిచయం చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన సాధారణ యోగా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. యోగాసనాలు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానం వంటివి సాధన చేశారు.క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల పని ప్రదేశంలో ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, సమగ్ర శ్రేయస్సును ఎలా పెంచుతుందో బోధకుడు వివరించారు. శాంతి ప్రార్థనతో ఈ యోగ సాధన కార్యక్రమం ముగిసింది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు; రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, పలువురు విభాగాధిపతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పురాతన క్రమశిక్షణను స్వీకరించడంలోని ఔచిత్యాన్ని వారు ఆచరణ రూపంలో చాటిచెప్పారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…