_20 ఏళ్లుగా మహిళా దినోత్సవాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 3, 4, 6 తేదీలలో పటాన్చెరు కేంద్రంగా నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మహిళా అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మండల పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు 20 సంవత్సరాలుగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 3, 4, 6 తేదీలలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రెండు రోజులు మైత్రి క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వివిధ అంశాలలో క్రీడా పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6వ తేదీన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బహుమతుల ప్రధానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులచే ఉపన్యాసాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలోని మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో సంబరాలకు హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్, మెట్టు రమాదేవి కుమార్ యాదవ్, ఎంఈఓ లు, సెర్ప్ ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…