పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘పర్యావరణ, సమాజం, పరిపాలనలో (ఈఎస్జీ) సమకాలీన సనుస్యలు’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును 2024 ఫిబ్రవరి 16-17 తేదీలలో నిర్వహించనున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ ఎస్ జీ ప్రాముఖ్యత, పర్యావరణం, సమాజం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ఎస్ జీలోని తాజా ధోరణులు, ఉత్తమ విధానాల గురించి పరిశ్రమ నాయకులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి తెలుసుకునే ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందన్నారు.ప్రభుత్వ విధానాలు, నిబంధనలు, కార్పొరేట్ పద్ధతులు, పెట్టుబడి వ్యూహాలు, వాటాదారులకు అనుగుణంగా ఈఎస్ జీ కి సంబంధించిన అనేక విస్తృత అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. ఈఎస్ జీ విధానాలను అమలు చేయడంలో సవాళ్లు, అవకాశాలతో పాటు, సాంకేతికత పాత్ర, ఈఎస్ జీ విధానాలు, నిబంధనలలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధాన వక్తలు చర్చిస్తారని తెలిపారు.ఈ సదస్సులో పాల్గొనేవారు విస్తృత చర్చలలో పాల్గొనడంతో పాటు పరిశోధనా పత్రాలను కూడా సమర్పించ వచ్చని, పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిన పరిశోధక పత్రాలను 2024 జనవరి 20వ తేదీలోగా సమర్పించాలని స్పష్టీక రించారు. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 2024 జనవరి 31లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన గీతం హైదరాబాద్ ప్రాంగణంలో వసతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పేర్ల నమోదు, పత్ర సమర్పణ, బస తదితర వివరాల కోసం డాక్టర్ జీ.ఆర్.కే.ప్రసాద్ 95429 78515లో సంప్రదించాలని, లేదా guttinggitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…