politics

త్వరలో తెలంగాణలో ఇన్లాండ్ పోర్ట్ !

పటాన్ చెరు:

దుబాయ్ కు చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డు విశ్వవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని , హైదరాబాద్ చుట్టుపక్కల సరకు రవాణా కోసం టెర్నినల్ను ( ఇన్లాండ్ పోర్ట్ ) నిర్మించాలనే యోచనలో ఉందని , త్వరలో అది సాకారం కావొచ్చని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి చెప్పారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచ్బీఎస్ ) లోని ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చెనై ఆధ్వర్యంలో ‘ లాజిస్టిక్స్ రంగం , అందులో పెరుగుతున్న కెరీర్ అవకాశాలు ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు అంతర్జాతీయ చర్చాగోష్ఠిని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , లాజిస్టిక్స్ రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదవుతోందని , మనదేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాలలో ఒకటిగా ఇది నిలిచిందని చెప్పారు . ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గతిశక్తి పథకం ఈ రంగానికి పెద్ద వరమన్నారు . విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేపట్టడంతో పాటు ఇంటర్నేస్లు చేస్తే ఈ రంగంపై మంచి అవగాహన ఏర్పడుతుందని ఆయన సూచించారు .

ఎంతో ఆశావహంగా ఉన్న ఈ రంగానికి కృత్రి మేథ , రోబోటిక్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం తోడెతే మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని భాస్కరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు . 1981 నుంచి లాజిస్టిక్స్ రంగం ఎదుగుదల , సాధిస్తున్న ప్రగతిని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గుర్తుచేశారు . మనదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో లాజిస్టిక్స్ రంగానికి 12 శాతం వాటా ఉందని , 18 శాతం వృద్ధిని ఆ రంగం నమోదు చేస్తున్నట్టు జీహెచ్బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ చెప్పారు .

లాజిస్టిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల గురించి చెన్నయ్ లోని లాజిస్టిక్స్ నెఫుణ్య మండలి ( ఎన్ఎస్సీ ) సీఈవో కెప్టెన్ రామానుజన్ , స్నాతకోత్సవ స్థాయిలో లాజిస్టిక్స్న ఒక పాఠ్యాంశంగా ప్రోత్సహించడంలో ఎల్ఎస్సీ పాత్ర గురించి ఆ సంస్థ అధిపతి ప్రొఫెసర్ ఎస్.గణేషన్ వివరించగా , డెల్లాయిట్కు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ డెరైక్టర్ సందీప్ చటర్జీ , జీఎంఆర్ ఎయిర్ కార్గో సీఈవో సౌరబ్ కుమార్ , ఐఎన్ఎస్ దక్షిణాసియా డెరైక్టర్ విపిన్ శంకర్ , బెల్జియంలోని పోర్ట్ ప్రాజెక్ట్స్ మేనేజర్ కొయిన్ కొర్నెల్లీ , ఐఎస్బీ సీనియర్ డీన్ ప్రొఫెసర్ చందన్ చౌధురి , షార్జాలోని స్కెలైన్ యూనివర్సిటీ డీన్ వె.రామకృష్ణ తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు . తొలుత ప్రొఫెసర్ దేబాషిశ్ ముఖర్జీ అతిథులను స్వాగతించగా , కార్యక్రమ నిర్వాహకుడు ఫకృద్దీన్ షేక్ వందన సమర్పణ చేశారు .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

18 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

19 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago