Telangana

విజయవంతంగా ముగిసిన ఇండస్ట్రీ కాంక్లేవ్

విద్యా సంస్థలు – పరిశ్రమల మధ్య అంతరాన్ని

తగ్గించేలా అర్థవంతమైన చర్చలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) కాలంలో జెన్-జెడ్: పునర్ నిర్మించే పని’ అనే అంశంపై ఒక రోజు ఇండస్ట్రీ కాంక్లేవ్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆధునిక పని ప్రదేశంలో అభివృద్ధి చెందుతున్న గతిశీలతను అన్వేషించడానికి ప్రముఖ పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చింది.మూన్ లైట్ సహ వ్యవస్థాపకుడు, వ్యాపార సలహాదారు, హచ్-వోడాఫోన్ మాజీ కార్యనిర్వహణాధికారి సామ్యూల్ సెల్వకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. అహ్మదాబాదులోని అదానీ గ్రూపు మానవ వనరుల విభాగం మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం బిట్స్-పిలానీ హైదరాబాదు ప్రాంగణంలో అనుబంధ అధ్యాపకుడు అనిల్ కలప విశిష్ట వక్తగా వ్యవహరించారు.

ఈ కాంక్లేవ్ లో భాగంగా రెండు ఆకర్షణీయమైన ప్యానెల్ చర్చలు జరిగాయి. మొదటి ప్యానెల్ లో వరుణ్ గోయల్ (యూనివర్సిటీ రిలేషన్స్ లీడర్, ఎర్లీ కెరీర్, నోకియా); ఎం. అజయ్ (సీహెచ్ఆర్వో, ఓక్ ట్రీ క్యాపిటల్); జయశ్రీ సాథి (స్టేట్ స్ట్రీట్ మేనేజింగ్ డైరెక్టర్) పాల్గొని, ‘ఏకాగ్రతను భంగపరిచే ప్రపంచంలో స్థిరమైన కెరీర్లు’ అనే అంశంపై చర్చించారు.రెండవ ప్యానెల్ లో షాలిని సహాయ్ (సీనియర్ ఉపాధ్యక్షురాలు, హెడ్-మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్); నాగార్జున మల్లాడి (ఉపాధ్యక్షుడు, హెడ్ – ఏఐ కేపబిలిటీ డెవలప్ మెంట్, టెక్ మహీంద్రా); గిరి ప్రసాద్ తేజోమూర్తి (అధ్యక్షుడు, రాణే మద్రాస్ లిమిటెడ్, ఆఫ్టర్ మార్కెట్ ప్రొడక్ట్స్ డివిజన్) ఉన్నారు. వారు ‘మానవ-కృత్రిమ మేధస్సు భాగస్వామ్యం: ఉద్యోగాలను భర్తీ చేయడం కాదు, పాత్రలను పునర్నిర్వచించడం’ అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

వీటికి అదనంగా, దీపక్ తాడూరు, హర్షవర్థన్ నాయకత్వం, మార్గదర్శకుడు (ట్రైల్ బ్లేజర్) అనే అంశాలపై ప్రసంగించారు. పీడబ్ల్యూసీ ఉమెన్ లీడర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను పూర్తిచేసిన విద్యార్థులకు విశిష్ట అతిథులు ప్రశంసా పత్రాలను బహుకరించారు. అలాగే వేసవి ఇంటర్నషిప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఐదుగురు ఎంబీఏ విద్యార్థులకు అవార్డులను కూడా అందజేశారు.గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా సమావేశం లక్ష్యాన్ని వివరించి, అతిథులను స్వాగతించగా, మార్కెటింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కెరీర్ సర్వీసెస్-పీజీ ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ రాకేష్ నాయుడు వందన సమర్పణ చేశారు.విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అర్థవంతమైన పరస్పర చర్యలను పెంపొందించే నెట్ వర్కింగ్ భోజనంతో ఈ కాంక్లేవ్ ముగిసింది.

admin

Recent Posts

కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సిఐటియు

-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో సిఐటియు యూనియన్ ఏర్పాటు -బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల…

9 hours ago

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి  - శేరిలింగంపల్లి : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. జగదీశ్వర్ గౌడ్,…

9 hours ago

అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవ్ 2025” గ్రాడ్యుయేషన్ వేడుక

మనవార్తలు ప్రతినిధి  - శేరిలింగంపల్లి : వాణిజ్యం మరియు నిర్వహణ విద్యలో ప్రముఖ పేరున్న అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్…

10 hours ago

ఆరోగ్యం, సామరస్యాలలో ఆహారం కీలకం

గీతంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం పలు ఆహ్లాదకర పోటీలలో పాల్గొన్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్యం,…

1 week ago

బిసి రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం చాల విడ్డురం_ మాజీ జెడ్పిటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…

2 weeks ago

నిరు పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్‌చెరు శాసన…

2 weeks ago