అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెందకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు. రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, బచ్చు గూడెం, పోచారం తో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంచెర్ల వరకు 22 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనివార్య కారణాల వలన విధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా.. తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టారని. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏ ఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గా రెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…