మనవార్తలు ,పటాన్ చెరు:
జాతీయ భావాన్ని ఉప్పొంగేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల చిట్కుల్ గ్రామ పరిధిలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని 50 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని తెరాస రాష్ట్ర నాయకులు,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్చరీ, స్కేటింగ్ క్రీడాకారిణి బంగారు పతకం విజేత శాన్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.చిట్కుల్ గ్రామ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామ కార్యవర్గం గ్రామస్తులు ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో ఈవో కవిత ,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీటీసీలు మంజుల,మాధవి,వార్డు సభ్యులు దుర్గయ్య,లక్ష్మి, వెంకటేష్,గౌరీ,భుజంగం, మురళి,వెంకటేష్,రాజకుమార్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షుడు వి నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్,గోపాల్,అనిల్,వెంకటేశ్, గ్రామ పెద్దలు,ప్రజలు, యువజన సంఘాలు,విద్యార్థులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…