Telangana

రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో పెరిగిన హుండీ ఆదాయం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ​రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయ‌క చ‌వితి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 ల‌క్ష‌ల 61 వేల 569 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు . ​హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 ల‌క్ష‌ల 46 వేల 712 రూపాయ‌లు, అన్న‌దానం హుండీలో ల‌క్ష 14 వేల‌857 రూపాయ‌లు భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న‌ట్లు ఆల‌య ఈవో లావ‌ణ్య తెలిపారు .ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతయ్యగా స్వయంభుగా వెలసిన స్వామి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేరుస్తూ నిరంతరం పూజలు అందుకుంటున్నార‌ని ఈవో లావ‌ణ్య తెలిపారు. భక్తులకు నమ్మకంతో  కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తునికి సిద్ధి గణపతి స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు
​ఈ కార్యక్రమంలో ఛైర్మ‌న్ హ‌రిప్ర‌సాద్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆల‌య జూనియ‌ర్ అసిస్టెంట్ ఈశ్వ‌ర్ , ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, నరసింహులు, కృష్ణవేణి, నరసింహారెడ్డితో పాటు సేవా సమితి సభ్యులు, అర్చ‌కులు,రుద్రారం గ్రామ పెద్ద‌లు ,భ‌క్తులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago