Telangana

బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం- నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని ,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో టీపీసీసీ పిలుపుమేరకు అసెంబ్లీ లో బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ అగ్రనేతలు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ల చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు.

ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం బీసీ కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేయడం ద్వారా యావత్ బీసీ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలు చేకూర్చాలని కొనియాడారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ఆ వర్గ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి 30 ఏండ్ల కలను సాకారం చేశారని కొనియాడారు. ఒకే రోజు రెండు చారిత్రాత్మక బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడంతో పాటు ఉభయ సభలలో వాటిని ఆమోదించడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయాలు యావత్ భారతావనికే ఆదర్శంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు.ఈ రెండు బిల్లులు ఆమోదంతో భారత రాజకీయలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు.
ఈ రెండు బిల్లులు ఆమోదంలో సహకరించిన ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంటామని తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago