Telangana

దేవుడి పేరుతో.. పిఎం మోదీ రాజకీయం _మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ

* 400 సీట్లు సాధిస్తుందని ప్రజల్లో భ్రమలు

* గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన బిజెపి గ్రాఫ్

* ఎంపీ ఎన్నికలతో బిజెపి పూర్తిగా పతనం

* అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ లోని శోభ గార్డెన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం నియోజికవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నరేంద్ర మోడీ రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణలో అయితే బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా పడిపోయిందని, ఈ ఎన్నికలలో పూర్తిగా పతనం అవడం ఖాయమని పేర్కొన్నారు. పేదలకు మోదీ ఏమీ చేయలేదని, అంబానీ, ఆదానీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బిజెపి అభ్యర్థి ఏం అభివృద్ధి చేశాడో? చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల రూపాయల అవినీతి చేసిందని, ఇంకా అనే అక్రమాలు, దోపిడీలకు పాల్పడిందన్నారు. సోషల్ మీడియా వేదికగా అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయని, తద్వారానే బిఆర్ఎస్ ప్రజలు గద్దె దించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అమలు చేయబోయే వాటిపైన కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించి పార్లమెంట్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మామ, అల్లుళ్లను ఇంటికి పంపించడం ఖాయం
మైనంపల్లి హనుమంత్ రావు

మామ, అల్లుళ్ళను నూటికి నూరు శాతం ఇంటికి పంపించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి అన్నారు.కేసీఆర్ ను చింతమడకకు, హరీష్ రావును తోటపల్లికి పంపడమే లక్ష్యమన్నారు. తన ప్రధాన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో వాళ్లను ఓడించడమేనని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం ఉందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

నిర్మలా జగ్గారెడ్డి, నియోజికవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి

మెదక్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నిద్రపోకుండా నీలం మధును గెలిపించుకొని ఆయనను పార్లమెంటుకు పంపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజికవర్గ ఇంచార్జ్ ప్రమోద్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, నర్సాపూర్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఒంటేరు నరేందర్ రెడ్డి, కేశిరెడ్డి రవీందర్ రెడ్డి, రాగుల రాజు, తాడూరి వెంకట్రామిరెడ్డి,హనునంత్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago