Telangana

చిట్కూలులో అంగరంగా వైభవంగా బోనాల సందడి

మనవార్తలు ,పటాన్ చెరు;

చిట్కూలు గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నాలుగురోజుపాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారికి ఓడిబియ్యం, తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల అనంతరం భవిష్యత్‌లో జరుగబోయే అంశాలను అమ్మవారి భవిష్యవాణి వినిపించనున్నట్లు తెలిపారు. ఆరోజు సాయంత్రం పలహార బండి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బండిని లాగేందుకు పోటేళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా అమ్మవారికి సర్పంచ్‌ మధు దంపతులు ప్రత్యేక పూజలు చేసి, పలహార బండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్ కాంతులు, యువతీయువకుల నృత్యాలు, డప్పుచప్పుళ్లతో అత్యంత వైభవంగా పలహార బండి ఊరేగింపు సాగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

రాష్ట్రాన్ని చల్లగా చూడు తల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చాక రాష్ట్ర ప్రజలు మన పండుగలను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. పండుగలకు కూడా అధికారిక గుర్తింపు ఇచ్చి రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కరే ఉన్నారని తెలిపారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి కూడా సీఎంను చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, చెర్మెన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేశ్, కృష్ణ, వెంకటేశ్,బుజాంగం,శ్రీను,మురళీ,వెంకటేశ్, రాజ్ కుమార్, నర్సింగ్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షులు నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్, నారబోయిన శ్రీనివాస్, పంబల గణేష్,శ్రీకాంత్,రజినీకాంత్ గ్రామ ప్రజలు, యువజన సంఘం నాయకులు,  ఎన్ఎమ్అర్  యువసేన పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago