Districts

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

_ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరు

_ఇక్రిశాట్ రాబోయే 25 ఏళ్ల లక్ష్యం నిర్దేశించుకోవాలన్న మోదీ

మనవార్తలు , పటాన్ చెరు:

ఇక్రిశాట్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వారికి సూచించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు.

రైతులకు లబ్ది చేకూర్చేలా వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడే సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదపడాలని అభిలషిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.భారత్ లో 80 శాతం మంది రైతులు చిన్న కమతాలు సాగుచేస్తున్న వారేనని తెలిపారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు.

సన్నకారు రైతులు సైతం పుంజుకునేలా వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని వివరించారు.వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టామని, డిజిటల్ అగ్రికల్చర్ తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు సాధ్యమని వెల్లడైందని ప్రధాని మోదీ వివరించారు. సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలని అన్నారు. సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ పంట దిగుబడులు పెరిగేలా చూడాలని తెలిపారు.

డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేసుకోవాలని వివరించారు. ఇక్రిశాట్ కూడా సాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించబోతున్నామని ప్రధాని వెల్లడించారు. పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అందుకోబోతున్నామని, పామాయిల్ సాగుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆహార భద్రత సాధించామని, మిగులు ధాన్యాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే భారత రైతుల జీవన ప్రమాణాలు మరింత పెరగాలని అన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago