చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు
ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట
మానసిక ఒత్తిడి లేని విద్యను అందించడమే రామయ్య ఆశయం
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఐఐటి రామయ్య ఆశయాలకను గుణంగా ఇష్టా విద్యాసంస్థలను తీర్చి దిద్దామని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట అన్నారు. గురువారం ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 100వ పుట్టినరోజు వేడుకలు ఇష్టా విద్యాసంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్సీ,అన్ని వర్గాల పేద విద్యార్థులకు ఐఐటీని పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ ఐఐటి చుక్కా రామయ్య జన్మదిన వేడుకలను ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో బీరంగూడ, పటేల్ గూడ, సంగారెడ్డి, మరియు పటాన్ చెరు బ్రాంచ్ ల లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.అనంతరం ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్, ఇష్టా విద్యాసంస్థల అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్ లు ఐఐటి చుక్కారామయ్య నివాసంలో రామయ్యను కలిసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐఐటి చుక్కారామయ్య 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జీవితంలో సాధించిన ఎన్నో గొప్ప విషయాలను గుర్తు చేస్తూ ఇష్టా విద్యాసంస్థలను ఆయన ఆశయాలకు తగ్గట్టుగా తీర్చి దిద్దామని తెలిపారు ఈనాటి విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేని విద్యను అందించడమే ఆయన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా ఇష్టా విద్యా సంస్థల యాజమాన్యం ఎల్లప్పుడు కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇష్టా విద్యాసంస్థల సంగారెడ్డి బ్రాంచ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి కిరణ్ రెడ్డి, పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ రజిత, వైస్ ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ రెడ్డి, బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ తులసి, వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ ,విజన్ స్కూల్ ప్రిన్సిపల్ ఇబ్రహీం మరియు ఇష్టా విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్ లు రమేష్ ,వెంకట్ రెడ్డి అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…