ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకూ నూతన సాంకేతికతలు వస్తున్నాయని, మారుతున్న పరిజ్ఞానంపై పట్టు సాధించిన, తగిన నెప్తుణ్యాలను అలవరచుకుంటే కోరుకున్న ఉద్యోగం పొందవచ్చని గీతం పూర్వ విద్యార్థి, అమెరికా (ఫ్లోరిడా)లోని అమెజాన్ రోబోటిక్స్లో పనిచేస్తున్న సురావ్ అనూజ్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని బీటెక్ చివరి ఏడాది విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.బీటెక్ పూర్తిచేస్తూనే ప్రాంగణ నియామకాలపై దృష్టి సారించి, అత్యుత్తమ నైపుణ్యాలతో కోరుకున్న ఉద్యో గాన్ని పొంది, కనీసం ఓ ఏడాది పాటు పనిచేయమని అనూజ్ సలహా ఇచ్చారు. ఆ తరువాత వృత్తిలోనే కొనసాగడమా, లేదా ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లడమా అనేది నిర్ణయించుకోవాలన్నారు. దీనివల్ల పని అనుభవంతో పాటు పరిశ్రమ పోకడలపై ఒక అవగాహన ఏర్పడుతుందని, ఆయా పరిస్థితులను బట్టి భవిష్యత్తుకు తగ్గ ప్రణాళికను రచించుకోవచ్చని అనూజ్ చెప్పారు. బీటెక్ పూర్తయ్యాక ఏడాది పాటు వచ్చే అనుభవం, అవగాహనలతో అమెరికాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది మాస్టర్స్ పూర్తిచేయొచ్చన్నారు. అప్పుడు మనం కలలు కన్న గరిష్ఠ వార్షిక వేతనం పొందడం సులువని చెప్పారు.
తాను గీతం ప్రాంగణ నియామకంలో ఎంపికై ఏటీ అండ్ టీలో ఏడాది పాటు పనిచేశానని, ఆ తరువాత ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లినట్టు తెలిపారు. తన ఎంఎస్ పూర్వవుతూనే ఉద్యోగం పొందానని, ప్రతి రెండేళ్లకో సారి మరింత ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించి విజయవంతంగా. మంచి వార్షిక వేతనాన్ని ఆర్జిస్తున్నట్టు అనూజ్ చెప్పారు. కంపెనీలు మారడం వల్ల నిరంతరం మారుతున్న నూతన సాంకేతికలపై పట్టు సాధించవచ్చన్నారు. గీతమ్ పలు విద్యార్థి క్లబ్బులు ఉన్నాయని, విద్యార్థుల అభిరుచిని బట్టి వాటిలో చేరి, సంపూర్ణ అవగాహన సాధించాలని అనూజ్ సూచించారు. గీతం విద్యార్థులకు తన వ్యక్తిగత అనుభవాలు, పరిశ్రమ పోకడలు, అనుకూలత.. యొక్క ప్రాముఖ్యతపై సమగ్ర అవగాహనను అందించారు.ఔత్సాహిక విద్యార్థుల కోసం తన సమయాన్ని వెచ్చించి, తగు జ్ఞానాన్ని ఉదారంగా అందజేసిన అనూజ్కు గీతం విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సీఎఫ్్న డాక్టర్ రమాకాంత్ బాల్ సురావ్ అనూజ్ను స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…