Districts

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్

మన వార్తలు , పటాన్ చెరు:

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్  అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారని తెలిపారు క్రీడల్లో రాణించిన విద్యార్థులు మానసికంగా కూడా చాలా చురుకుగా ఉంటారని అన్నారు.

గతంలో క్రీడాకారులుగా ఎదిగిన వారందరూ కూడా సమాజంలో ఉన్నతమైన గౌరవం పొందుతున్నారని అన్నారు. అనేకమంది ఆ కోటాలో ఉద్యోగాలు సంపాదించి మంచి జీవితాన్ని గడుపుతున్నారని గుర్తుచేశారు. క్రీడాకారుల వల్ల ఆ గ్రామానికి, దేశానికి మంచి పేరు లభిస్తుందని అన్నారు. పూజ కూడా జాతీయస్థాయిలో మంచి క్రీడాకారిణిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారుల ఎదుగుదలకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని స్పష్టం తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎట్టయ్య ముదిరాజ్, పైల్వాన్ చంద్రకాంత్ పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago