పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దార్శనికుడు, దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పటాన్‌చెరు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామం తో పాటు, తదనంతరం ఏర్పడిన ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డి,సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, కొమరగూడెం వెంకటేష్, రుద్రారం శంకర్, అఫ్జల్, పృథ్వీరాజ్, చంద్రశేఖర్, శ్రీరాములు, షకీల్, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…