Telangana

ఫుడ్ సైన్స్ లో అపార అవకాశాల…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రొఫెసర్ విజయా ఖాదర్

మనవార్తలు ,పటాన్ చెరు:

ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలున్నాయని , విద్యార్థుల అభిరుచికి తగ్గ విభాగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , హోమ్ సెన్ట్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ ఖాదర్ అన్నారు . ‘ కనెక్ట్ ‘ ఉపన్యాసాల పరంపరలో భాగంగా , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ , డెరైక్టరేట్ ఆఫ్ ఎక్స్టెర్నల్ రిలేషన్స్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . విద్యార్థుల కెరీర్ను ఎలా మలచుకోవాలి , పరిశోధనావకాశాలు , ఔషధ , రసాయన పరిశ్రమలలో ఫుడ్ సెన్స్ , టెక్నాలజీ నెపుణ్యాలను ఎలా అన్వయిస్తారు అనే అంశాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు . తాను హోమ్ సెన్స్డ్ బోధించేటప్పుడు ‘ వండుకోని , తినేదేగా ‘ అని తోటి అధ్యాపకులే చులకన చేసిన సందర్భాలు ఉన్నాయని , తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఇష్టంగా పనిచేయడం . ద్వారా రెండు మేథోహక్కులు , 86 పరిశోధనా పత్రాలు , ఆరు విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశ పుస్తకాలు , 22 పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి , ఎన్నో అవార్డులు , రివార్డులను పొందినట్టు విద్యార్థుల హర్షధ్వానాల డాక్టర్ విజయ సగర్వంగా ప్రకటించారు .

ఫుడ్ సె భద్రత , నాణ్యత నియంత్రణ , ఉత్పత్తుల అభివృద్ధి వంటి పలు విభాగాలున్నాయని , ఆయా విద్యార్థుల నేపథ్యం , అభిరుచికి తగ్గవాటిని ఎంపిక చేసుకుని రాణించాలని ఆమె సూచించారు . ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగానే ఉన్నాయని , వృత్తిలో నెపుణ్యం సాధించిన వారికి విశ్వవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు . తెలివిగా ఆలోచించగలిగితే ఈ రంగంలో స్వయం ఉపాధి చేపట్టి సులువుగా రాణించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ స్పష్టీకరించారు . పూర్వకాలంలో ఇళ్ళలో చేసుకునే ఉలవచారు ఈ రోజు ఐదు నక్షత్రాల హోటళ్ళు , ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్లలో మెనూగా మారిందని , అలాగే పాలతాళికలు , కొబ్బరి / రాగి ఉండలు అని ఆమె వివరించారు . ఫుడ్ ప్రాసెసింగ్ లేక దాదాపు 30 శాతం వ్యవసాయ ఉత్పత్తులు ప్రతియేటా వృథాగా పోతున్నాయని , అంటే రమారమి రూ .580 కోట్ల విలువైనవని , అవి 23 కోట్ల మంది క్షుద్బాధను తీర్చగలవని చెప్పారు .

గ్రామీణ ప్రాంతాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా అటు ఉత్పత్తుల వృథాను అరికట్టడమే గాక ఉపాధి అవకాశాలు , మహిళా సాధికారతను కల్పించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ పేర్కొన్నారు . ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిసతి ప్రొఫెసర్ ఉమామహేశ్వరి స్వాగతోపన్యాసం చేయగా , కెరీర్ గెడైన్స్ సెల్కు చెందిన కెరియల్ ఫుల్ఫిల్మెంట్ అధికారి డాక్టర్ రమాకాంత్ బాల్ వందన సమర్పణ చేశారు . డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , డాక్టర్ జి.నిహారిక , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago