పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 305 చర్చిలకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చర్చి పాస్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చిలకు కేకులను పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని నిరుపేద క్రిస్టియన్ల కోసం క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంగా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు.అనంతరం నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమం కోసం 10 లక్షల రూపాయల సొంత నిధులను పాస్టర్ల సంఘానికి అందజేశారు. ఆపదలో ఉన్న క్రిస్టియన్ల సంక్షేమానికి వీటిని వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సోమిరెడ్డి, పరమేష్ యాదవ్, అఫ్జల్, బాబ్జి, బండి శంకర్, పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…