_ఏపీఆర్ సంస్థ ఆధ్వర్యంలో 5K రన్
_విజేతులకు బహుమతుల ప్రధానం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.శనివారం ఉదయం పటాన్చెరు పట్టణ పరిధిలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 5కే రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం గంట సమయం వ్యాయామానికి సమయం కేటాయించాలని అన్నారు. దీని ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుద్యత లభిస్తుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎండి సంజీవరెడ్డి, భారీ సంఖ్యలో ఏపీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…