మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
తిరంగా యాత్ర వంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం,ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో ప్రదర్శనను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందు మూల శివారెడ్డి,మందుమూల హర్షారెడ్డి, మున్సిపాలిటీ ఇంచార్జ్ కొండా లక్ష్మణ్ ఇరువురు విచ్చేసి హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు.అనంతరం అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం చాల ఆనందంగా ఉందని , చేపట్టిన ఈ భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది అని అన్నారు . సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చేతిలో మువ్వన్నెల జెండాలు పట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు.ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపడమే ‘హర్ ఘర్ తిరంగా’ ముఖ్య ఉద్దేశం అని మన జాతీయ జెండా మన సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీక ఇంటింటా మువ్వన్నెల జెండా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఇంద్రేశం పురవీధుల గుండా విద్యార్థుల “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” నినాదాలతో పరిసరాలన్నీ మారుమోగిపోయాయి. చిన్నారి విద్యార్థుల ఉత్సాహం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మనీష్ రెడ్డి,శ్రీకాంత్, సంతోష్,శశి, పూజ, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ర్యాలీని దిగ్విజయం చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…